
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. క్రికెట్ అన్ని ఫార్మేట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా అభిమాన గణం ఏమాత్రం తగ్గలేదు. అందుకు ఉదాహరణే ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న ఆదరణ. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో ధోనీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి సందడి చేశాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్‌కి గ్లోబల్ స్టార్ గా ఖ్యాతిగాంచాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. తాజాగా ఎం.ఎస్.ధోనీని రామ్ చరణ్ ముంబైలో కలిశాడు. దీంతో ఫ్యాన్స్ గతంలో రామ్ చరణ్ ధోనీ కలిసి నటించిన ఒక ప్రకటనను గుర్తు చేసుకుంటున్నారు.

సుమారు 13 ఏళ్ల క్రితం అంటే 2009లో ధోని , చరణ్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. అప్పట్లో ఈ పెప్సి యాడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళాడు. అక్కడే ధోనీని కలవడంతో వీరిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారని.. అందుకే, వీళ్లిద్దరూ కలిశారని టాక్ వినిపిస్తోంది.

తాను ధోనీ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన రామ్ చరణ్.. భారతదేశం గర్వించదగిన క్రికెటర్‌ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని కామెంట్ జత చేశాడు. అయితే అభిమానులు వీరి కలయికకు కారణం ఏమై ఉంటుందా అని అంటూ తెలుసుకునే పనిలో ఉన్నారు.

ధోనీ కూడా ఇటీవల సినీ పరిశ్రమలో ధోని ప్రొడక్షన్ తో అడుగు పెట్టాడు. ఇప్పటికే తమిళంలో ఎల్‌జిఎం చిత్రాన్ని నిర్మించాడు. దీంతో ధోని భార్య ధోని నటుడిగా త్వరలో ఎంట్రీ ఇస్తాడనే చెప్పిన విషయాన్నీ గుర్తు చేసుకుని .. ఇప్పడు రామ్ చరణ్, ధోనీ కలిసి ఓ సినిమాలో నటిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ధోనీ, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

అయ్యప్ప స్వామి మాలలో ముంబై కి వెళ్లిన రామ్ చరణ్.. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో తన దీక్షను విరమించారు.