
ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లింది. అక్కడ బిజీబిజీగా గడుపుతోంది. అదే సమయంలో తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

సారా అలీఖాన్ కేదార్‌నాథ్ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించారు.

సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్ ల కుమార్తె అయిన సారా అలీ ఖాన్‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే తరచుగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూనే ఉంటుంది.

తన జీవితంలో కేదార్‌నాథ్ ఆలయానికి చాలా ప్రాధాన్యముందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది సారా అలీఖాన్. ఇక్కడే ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.

ఇక్కడికి వచ్చే అదృష్టం కొందరికే ఉంది, కానీ రెండోసారి ఇక్కడికి రావడం నా ఆశీర్వాదంగా భావిస్తున్నాను అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింద సారా అలీఖాన్. ప్రస్తుతం ఆమె టూర్ ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.