కన్నడ హీరో రక్షిత్ హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది.
తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తోన్న రామ్.. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఈ సినిమాలో రామ్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బ్యూటీని మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అందుకు రుక్మిణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత రుక్మిణికి తెలుగులోను మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.
రామ్ పోతినేని జోడిగా 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్..