
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ చాలా అరుదుగా వినిపిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం విజయశాంతి లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటారు. తరువాత ఈ జనరేషన్‌లో నయనతార మాత్రమే ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి నెక్ట్స్ ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న బ్యూటీ ఎవరు..?

ప్రజెంట్ సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ అన్న స్టేటస్‌ను ఒక్క నయనతార మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య సమంత ఆల్మోస్ట్ ఆ రేంజ్‌కు వచ్చేసినట్టుగానే కనిపించినా... తరువాత స్లో అయ్యారు.

దీంతో నెక్ట్స్ నెంబర్ వన్ రేసులో ప్రూవ్ చేసుకునే బ్యూటీ ఎవరన్న డిస్కషన్ మొదలైంది. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ రేసులో... ప్రజెంట్ ఉన్న హీరోయిన్లలో ఇద్దరి పేర్లే మేజర్‌గా వినిపిస్తున్నాయి.

గ్లామర్ ప్లస్ టాలెంట్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన్న... మంచి పెర్ఫామర్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ ఇద్దరిలో ఎవరు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సాధిస్తారన్న చర్చ జరుగుతోంది.

రష్మికకు నటిగానూ మంచి పేరే ఉన్నా... ఎక్కువ సక్సెస్‌లు మాత్రం గ్లామర్ రోల్స్‌తోనే వచ్చాయి. గ్లామర్ అన్న మాటకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కేవలం తన నటనతోనే నెంబర్ వన్ రేసులోకి వచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటారో చూడాలి.