Rajamouli: అక్కడైనా.. ఇక్కడైనా.. రాజమౌళిను టచ్ చేసే దమ్ముందా

Edited By: Phani CH

Updated on: Jun 27, 2025 | 9:53 PM

ఇండస్ట్రీ ఏదైనా నడిచేది హీరోల రాజ్యమే కదా..? వాళ్లను కాదని ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? ఎంత పెద్ద దర్శకుడైనా హీరోను మించి కాదుగా అనుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం దీనికి మినహాయింపు. ఆయన స్థాయి వేరు.. స్థానం వేరు. ఇప్పుడేకంగా ఇంటర్నేషనల్ వీడియో గేమ్‌లో దర్శక ధీరుడు ప్రత్యక్షమయ్యారు. మరి అదేంటో చూద్దామా..?

1 / 5
రాజమౌళికి ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్‌గానూ గుర్తింపు మామూలుగా లేదిప్పుడు. RRR తర్వాత ఈయన స్థాయి గ్లోబల్‌గా ఎదిగింది. తాజాగా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు జక్కన్న.

2 / 5
తనయుడు కార్తికేయతో కలిసి జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్' వీడియో గేమ్‌లో కనిపించారు దర్శక ధీరుడు.

3 / 5
ఈ వీడియో గేమ్‌లో రాజమౌళిని ది అడ్వెంచరర్‌గా, కార్తికేయను అడ్వెంచరర్ సన్‌గా చూపిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, హిడియో కొజిమా మధ్య అనుబంధం 2022లో RRR సమయంలో మొదలైంది.

4 / 5
అప్పుడే ఈ గేమ్‌కు సంబంధించి తన బాడీ కొలతలు ఇచ్చి వచ్చారు జక్కన్న. ఆ గేమ్ ఇప్పుడు వస్తుంది. ట్రిపుల్ ఆర్ టైమ్‌లోనే కొజిమా స్టూడియోకు వెళ్లి అక్కడి 3D క్యారెక్టరైజేషన్ టెక్నాలజీని పరిశీలించారు.

5 / 5
నాటి పరిచయమే డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్‌లో రాజమౌళి ఎంట్రీకి దారిచ్చింది. ఈ గేమ్ 2025 జూన్ 26న ప్లే స్టేషన్ 5లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికీ మన దర్శకుడిపై జపాన్‌లో వీడియో గేమ్ అంటే చిన్న విషయం కాదు.. అది ఆయన రేంజ్ అంటే..!