
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్.

అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది.

కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక మరోవైపు ఈ సినిమా ఇప్పుడు జపాన్‌లో ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 21, 2022 న విడుదల అయినది

దీంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు జపాన్‌కి వెళ్లారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చి.. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు.