
టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ బ్యూటీ రాశి సింగ్ (Rashi Singh). సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన కొన్ని సాంప్రదాయ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పచ్చటి రంగు చీరలో, దానికి తగ్గ హెవీ జ్యువెలరీ , మినిమల్ మేకప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. క్లాసీ లుక్‌తో పాటు తనదైన గ్లామర్‌ను జోడించి ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎయిర్ హోస్టెస్ నుండి వెండితెర వరకు: రాశి సింగ్ సినీ ప్రయాణం ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించిన రాశి సింగ్ చిన్నతనం నుంచే నటి కావాలని కలలు కన్నారు.

అయితే, ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో ఆమె 18 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు మారడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉద్యోగంలో ఎంత సంతోషంగా ఉన్నా, నటనపై ఉన్న మక్కువతో రిస్క్ తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి టాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2021లో ఆది సాయికుమార్ సరసన 'శశి' (Sashi) చిత్రంతో రాశి సింగ్ తెలుగు ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టారు. మొదటి సినిమాలో భాష తెలియకపోయినా, ఎంతో కష్టపడి డైలాగ్స్ నేర్చుకుని తన నటనతో మంచి మార్కులు కొట్టేసారు.

ఆ తర్వాత 'పోస్టర్', 'జెమ్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో దూకుడుకేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ రాశి సింగ్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు.భూతద్ధం భాస్కర్ నారాయణ (2024): శివ కందుకూరి సరసన లక్ష్మి అనే జర్నలిస్ట్ పాత్రలో రాశి అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రసన్నవదనం (2024): సుహాస్ హీరోగా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో 'ఏసీపీ వైదేహి' (ACP Vaidehi) అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించి, వర్సటైల్ నటిగా ప్రశంసలు అందుకున్నారు. బ్లైండ్ స్పాట్ & రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్': వైవిధ్యమైన జోనర్లలో వచ్చిన ఈ చిత్రాలు ఆమె నటనలోని సరికొత్త కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

కేవలం వెండితెరపైనే కాకుండా 'పాపం పసివాడు', 'త్రీ రోజెస్ (సీజన్-2)' వంటి పాపులర్ వెబ్ సిరీస్‌ల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చాటారు.సోషల్ మీడియాలో సెన్సేషన్సినిమాల్లో డీగ్లామరైజ్డ్, సీరియస్ పాత్రలు చేసినప్పటికీ, రియల్ లైఫ్‌లో రాశి సింగ్ ఎంతో స్టైలిష్‌గా ఉంటారు. "నా రూపం చూడాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ చూడొచ్చు, కానీ నా సినిమాల్లో మాత్రం కేవలం నా క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి" అని నమ్మే నటి రాశి. తాజాగా పచ్చటి చీరలో ఆమె చేసిన ఫోటోషూట్ కూడా అదే విషయాన్ని నిరూపిస్తోంది.

సాంప్రదాయ కట్టులోనూ ఎంత గ్లామరస్‌గా మెరవవచ్చో ఆమె చూపించారు. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి "అచ్చమైన తెలుగు అందం", "స్టన్నింగ్ లుక్" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరికొన్ని క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ రాశీ సింగ్ టాలీవుడ్‌లో క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.