Film News: యాక్షన్ మోడ్‌లో గేమ్ చేంజర్‌.. ఉత్తమ నటిగా నయన్‌..

| Edited By: Prudvi Battula

Feb 22, 2024 | 10:45 AM

గేమ్ చేంజర్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ రెండో సారి తల్లి అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తన 50వ సినిమాను స్వయంగా డైరెక్ట్‌ చేశారు. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్‌. జీతేగా తో జియేగా అనేది ట్యాగ్ లైన్‌. 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌ 2024' వేడుక ఘనంగా జరిగింది. 

1 / 5
గేమ్ చేంజర్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఓ స్టైలిష్ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శంకర్‌. రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

2 / 5
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ రెండో సారి తల్లి అయ్యారు. స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని పెళ్లాడిన అనుష్కకు ఇప్పటికే వామికా అనే కూతురు ఉంది. ఇప్పుడు తమ కుటుంబంలోకి అకాయ్‌ను ఆహ్వానించాం అంటూ ట్వీట్ చేశారు విరాట్‌, అనుష్క. పెళ్లి తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క త్వరలో చక్దా ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

3 / 5
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తన 50వ సినిమాను స్వయంగా డైరెక్ట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు ధనుష్‌ అన్న, స్టార్ డైరెక్టర్‌ సెల్వ రాఘవన్ కథ అంధించారన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన సెల్వ, రాయన్ పూర్తిగా ధనుష్‌ తయారు చేసుకున్న కథ అని క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో కేవలం నటుడ్ని మాత్రమే అన్నారు సెల్వ రాఘవన్‌.

4 / 5
బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్‌. జీతేగా తో జియేగా అనేది ట్యాగ్ లైన్‌. అడ్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమీ జాక్సన్‌, అర్జున్ రాంపాల్‌, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌.

5 / 5
'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌ 2024' వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవటం ఆనందంగా ఉందన్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. బాలీవుడ్ మూవీ జవాన్‌లో చేసిన క్యారెక్టర్‌కు ఈ అవార్డు అందుకున్నారు నయన్‌. షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ మూవీకి అట్లీ దర్శకుడు.