
ఎలక్షన్లు పూర్తయ్యాక మిగిలిన వాళ్లందరూ సినిమాల మీద ఇష్టాన్ని ఏదో రకంగా చాటుకుంటూనే ఉన్నారు. మీరు కూడా త్వరలోనే మొదలుపెట్టండి బాసూ అని రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. పవర్‌స్టార్ ప్రెజెంట్ సినిమాల నిర్మాతలైతే మరో అడుగు ముందుకేసి ఆయన్ని కలిసొచ్చారు.

ఫస్ట్ గ్లింప్స్ తోనే అదిరిపోయే హైప్ పెంచేశారు ఓజీ మేకర్స్. ఓజీ విడుదలవుతుంది... చూద్దురుగానీ అని పవన్ చెప్పిన ఒక్క మాటతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఓజీ. పవర్‌స్టార్ కెరీర్‌లో ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.

ఓజీ మేకర్స్ వెళ్లి కలిసిన వెంటనే హరిహరవీరమల్లు మేకర్స్ కూడా పవర్‌స్టార్‌ని మీట్ అయ్యారు. ఈ ఏడాదిలోగా ఈ సినిమాను విడుదల చేస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. దానికి తగ్గట్టుగానే ఎగ్జయిటింగ్ అనౌన్స్ మెంట్స్ వరుసలో ఉన్నాయంటూ ఊరిస్తున్నారు మేకర్స్

200 కోట్లతో తెరకెక్కుతోంది హరిహరవీరమల్లు. పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ అవుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుంది.

ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ గురించి ఆలోచిస్తారు పవన్ కల్యాణ్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్. ఆ తర్వాతే సురేందర్‌రెడ్డి సినిమా లైన్‌లో ముందుకు జరిగేది.