
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా తన కుమారుడి ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

తాజాగా దిల్ రాజు ఇంట్లో ఓ శుభకార్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తేజస్విని ట్రెడిషిన్ లో లుక్ లో దర్శనమిచ్చింది. పట్టుచీర కట్టి, నగలు ధరించి, పూలు పెట్టి ఎంతో అందంగా కనిపించింది తేజస్విని.

ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా తేజస్వినినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఉపనయనం ఫంక్షన్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్' అంటూ ఈ ఫొటోలకు సరదాగా క్యాప్షన్ ఇచ్చింది తేజస్విని. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా దిల్ రాజు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మధ్యన సినిమాల నిర్మాణాన్ని బాగా తగ్గించేశారు దిల్ రాజు.

చివరిగా నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దిల్ రాజు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన అనే సినిమాను నిర్మిస్తున్నారీ స్టార్ ప్రొడ్యూసర్. రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకుడు.