
మలయాళీ సినీరంగంలో టాప్ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. తెలుగుతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లూసిఫర్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

కొన్ని రోజుల క్రితం పృథ్వీరాజ్ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కొత్త డైరెక్టర్ జయన్ నంబియార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పృథ్వీరాజ్, షమ్మీ తిలకన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు విలాయత్ బుద్ధ.

ఈ కథ నవల ఆధారంగా రూపొందించారు. తమిళనాడు సరిహద్దులోని మరయూర్ అనే పట్టణంలో గంధపు చెక్కల అక్రమ రవాణా గురించి ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. మొదటి రోజు ఈ సినిమా రూ.1.7 కోట్లు రాబట్టింది.

విడుదలైన 12 రోజుల్లో ఈ సినిమా రూ. 8 కోట్ల వరకు వసూలు చేసింది. డిసెంబర్ 3న కేవలం రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇప్పటివరకు వరుస సినిమాలతో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ కెరీర్ లో ఈ చిత్రం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు విలన్ గానూ నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కుంభ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.