
ప్రభాస్ కూడా ఎప్రిల్ 10న రావడం అసాధ్యం. ఇప్పటికే రాజా సాబ్ వాయిదా ఖరారైపోయింది కాకపోతే అక్కడ్నుంచి అధికారిక సమాచారం రాలేదంతే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చినా.. VFX వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ అవ్వడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా. దాంతో 2025 సమ్మర్‌కు మరోసారి కష్టకాలమే.

పరిస్థితులు చూస్తుంటే ఈ సమ్మర్ భారం కూడా నాని, విజయ్ దేవరకొండపైనే పడేలా ఉంది. మార్చ్ 28న నితిన్ రాబిన్ హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్‌తో ఈ సమ్మర్ షురూ కానుంది.

ఆ తర్వాత ఎప్రిల్ 10న సిద్దూ జొన్నలగడ్డ జాక్ విడుదల కానుంది.. ఇక ఎప్రిల్ 18న అనుష్క ఘాటీ రానుంది. అదేరోజు రావాల్సిన తేజ సజ్జా మిరాయ్ వాయిదా పడేలా కనిపిస్తుంది. ఇక ఎప్రిల్ 25న కన్నప్పతో మంచు విష్ణు వస్తున్నారు.

మే బాధ్యత అంతా నాని తీసుకుంటున్నారు. ఈయన నటిస్తున్న హిట్ 3 మే 1న విడుదల కానుంది. అలాగే రవితేజ మాస్ జాతర మే 9న వస్తుందంటున్నారు కానీ కన్ఫర్మేషన్ లేదు

ఇక మార్చ్ 28 నుంచి వాయిదా పడ్డ విజయ్ దేవరకొండ VD12 మే 30న వస్తుందంటున్నారు.. కానీ వచ్చేవరకు అనుమానమే. ఎలా చూసుకున్నా.. 2025 సమ్మర్ సీజన్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది.