
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ ఆదివారం అంతా ఒకటే గుస గుస. అయితే పవర్‌స్టార్ స్టైల్‌గా బెజవాడలో అడుగుపెట్టారు. పాలిటిక్స్ పనుల్లో ఆయన బిజీగా ఉంటే, ఆయన కెప్టెన్లు ముగ్గురు.. తమ తమ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు.

వారిలో ఒకరు ఇప్పుడు మొదలుపెట్టానని అంటుంటే, ఇంకొకరు... జస్ట్ ఫినిష్ చేశా అంటున్నారు. మరొకరు మాత్రం ప్రోగ్రెస్‌లో ఉందని చెబుతున్నారు. ఇంతకీ వారు చెబుతున్న విశేషాలేంటి?

ఎక్కడున్నావు పవన్ బ్రో అని అంటే, బెజవాడలో అని బదులిస్తున్నారు పవర్‌స్టార్. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ టైమ్‌లో ఆయన ఫోకస్ ఎక్కువగా పాలిటిక్స్ మీదే ఉంది. సార్‌ని కొన్నాళ్లు ఫ్రీగా వదిలేద్దాం. అంతలో మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని వద్దాం అని ఫిక్సయ్యారు పవన్ కెప్టెన్లు.

రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ కీ షెడ్యూల్ కంప్లీట్ చేసేశారు హరీష్ శంకర్. ఔట్‌పుట్ చూసుకుంటే తృప్తిగా అనిపించిందని అన్నారు. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌కి కామా పెట్టి మరీ మిస్టర్ బచ్చన్ పనుల మీద ఫోకస్ పెంచారు హరీష్.

హరిహరవీరమల్లు కెప్టెన్ క్రిష్ కూడా ఇంకో ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అనుష్క నాయికగా ఆయన కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇండస్ట్రీలో. వేదం తర్వాత అనుష్కతో మళ్లీ పనిచేస్తున్నారు క్రిష్.

ఈ సినిమా పూర్తయ్యాకే హరిహరవీరమల్లు మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారు క్రిష్ జాగర్లమూడి. ఓజీ డైరక్టర్ సుజీత్ మాత్రం సేమ్ ప్రాజెక్ట్ మీద స్టేబుల్‌గా ఉన్నారు.

పవన్ సినిమాల అప్‌డేట్లు ఏమీ లేవని ఫ్యాన్స్ నిరాశపడుతున్న సమయంలో ఓజీ రిలీజ్ డేట్ ఇచ్చి, వాళ్లల్లో ఎనర్జీని బూస్ట్ చేశారు సుజీత్. ఓజీ షూటింగ్ పూర్తయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ చేయించే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు కెప్టెన్.