
తాను నటించిన చిత్రాలన్నిటిలో రెట్రో చాలా స్పెషల్ అని చెప్పారు నటి పూజా హెగ్డే. ఆ సినిమాలో ప్రతి సన్నివేశం తనకు ఇష్టమన్నారు. సీన్స్ తెరకెక్కించిన తీరు, వాటిలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పారు. తానింకా పూర్తి సినిమా చూడలేదని చెప్పారు.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సిద్దుకి జోడిగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ మూవీ సమ్మర్లో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు మేకర్స్.

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరి ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంటున్నానన్నారు రష్మిక మందన్న. సినీ ప్రియుల ప్రేమను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చదువకునే రోజుల్లో తాను కాలేజీ క్రష్‌నని, ఆ తర్వాత కర్ణాటక క్రష్ అని, ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యానని చెప్పారు రష్మిక మందన్న.

అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబసభ్యులు ప్రధాని మంత్రి మోదీని కలిశారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గురించి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ్ పుస్తకాన్ని ప్రధాని చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అమల, నాగచైతన్య, శోభిత పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ కుమారుడు దినేష్ మహీంద్ర పరిచయమవుతున్నారు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు దినేష్. ఏప్రిల్‌లో షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.