Pooja Hegde: పూజా హెగ్డే కెరీర్‌లో మరో కీలక మలుపు.. బుట్టబొమ్మ ఆఖరి ప్రయత్నం ఫలిస్తుందా

Edited By: Phani CH

Updated on: Jun 02, 2025 | 8:15 PM

గురువు గారు తొందర్లో ఆఖరి రాగం పాడేసారు అంటూ కింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందా..? ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. కెరీర్ చివరి దశకు వచ్చేయడంతో.. ఈమె కూడా ఆఖరి రాగం పాడేస్తున్నారు. మరి ఈ డైలాగ్‌కు సరిపోయేంతగా పూజా ఏం చేస్తున్నారు..? అసలు ఆమె చేసిన పనేంటి..? ఆమె పాడిన ఆ ఆఖరి రాగమేంటి..? అసలేంటి స్టోరీ..

1 / 5
చెప్పడానికేం లేదు.. ఒకటే మాట.. కొన్నేళ్ళుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోడానికి హిట్స్ లేవు.. చేతిలో సినిమాల్లేవు.. చేసిన సినిమాలు ఆడట్లేదు.. ప్రస్తుతం ఇదే పూజా కెరీర్.

2 / 5
కానీ మిగిలిన చోట్ల పర్లేదు.. తమిళంలో విజయ్‌‌తో జన నాయగన్, రజినీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు పూజా.. అలాగే హిందీలోనూ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. కాంచన 4లోనూ పూజానే హీరోయిన్‌గా తీసుకున్నారు లారెన్స్.

3 / 5
తమిళంలో బిజీగానే ఉన్నా.. తెలుగులో మాత్రం పూజాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగ చైతన్య, విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. దాంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బుట్టబొమ్మ.

4 / 5
కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్‌లపై ఫోకస్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా నెట్ ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది.

5 / 5
తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. డిమోంటి కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్.. పూజా కోసం ఓ కథ సిద్ధం చేసారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్‌తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.