
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ నెట్టింట తరచూ తన ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

సోషల్ మీడియాలో అనుపమను అనుసరించే వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా జిమ్ డ్రెస్‌లో ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసింది అనుపమ.

అందులో ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు అనుపమ క్యూట్ ఫొటోలకు ఫిదా అవుతున్నారు.

కాగా ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది అనపమ. జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమాలోనూ నటిస్తోంది అనుపమ. అలాగే ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంటోంది.