నువ్ ఇంతకంటే దిగజారవు అన్న ప్రతీసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్ అని జెర్సీలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..! ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. మీరు ఇంతకంటే నిరాశ పరచరు అన్న ప్రతీసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్ అంటున్నారు వాళ్లు.
అసలు ప్రభాస్ ఫ్యాన్స్ బాధేంటి.. సలార్ ఎందుకు మాటిమాటికి వాయిదా పడుతుంది..? ప్రశాంత్ నీల్ ఎందుకిలా చేస్తున్నారు..? ఏమైందో ఏమో కానీ ఈ మధ్య ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రావట్లేదు. కోర్టు కేసుల్లా.. ఈయన సినిమాలు కూడా ప్రతీసారి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
సలార్‌కు ఇది తప్పట్లేదు. సెప్టెంబర్ 28 పక్కా అంటూ ముందు నుంచి చెప్తూ వచ్చి.. చివరికిప్పుడు మరోసారి సారీ అని చెప్పేసారు మేకర్స్. ఏదో మొక్కుబడిగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు.
సలార్ పోస్ట్‌పోన్‌పై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఈ విషయం అప్పుడే చెప్పకుండా.. చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇప్పుడు సింపుల్‌గా ఓ ప్రెస్ నోట్‌తో తేల్చేసారు దర్శక నిర్మాతలు. కనీసం చెప్పేదేదో క్లారిటీగా చెప్పొచ్చుగా అంటూ హోంబళే ఫిల్మ్స్‌ను ట్రోల్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
గతంలో సాహో టైమ్‌లో యువీ క్రియేషన్స్‌కు.. ఆదిపురుష్ అప్పుడు ఓం రౌత్‌కు ఈ ట్రోల్స్ తప్పలేదు. అసలే పోస్ట్‌పోన్ అయిందనే ఫ్రస్టేషన్‌లో ఉంటే.. ఎప్పుడొస్తుందో చెప్పకపోవడం ఫ్యాన్స్‌కు మరో షాక్. సలార్‌కు ముందున్న ఆప్షన్స్ అయితే మూడే.
దసరాకు ఎలాగూ హౌజ్ ఫుల్ కాబట్టి.. నవంబర్‌లో మంచి డేట్ చూసుకుని రావడం.. లేదంటే డిసెంబర్‌లో క్రిస్మస్ సీజన్‌కు రావడం.. అదీ కాదంటే సంక్రాంతికి రావడం. ఈ మూడింట్లో నవంబర్ అయితే సోలో రిలీజ్ ఉంటుంది కాబట్టి కనీసం అప్పటికైనా సినిమా విడుదల చేయమంటున్నారు అభిమానులు.