
బాలీవుడ్‌లోని అత్యంత బోల్డ్, అందమైన నటీమణులలో నోరా ఫతేహీ కూడా ఒకరు. నోరా తన అద్భుతమైన ఫిగర్, పర్ఫెక్ట్ డ్యాన్స్ మూవ్స్, వెస్టర్న్ డ్రెస్సెస్‌తో కుర్రకారు నుంచి ముసలివాళ్ల వరకూ అందరిలోనూ వేడి పుట్టింస్తూ ఉంటుంది.

ఎప్పుడూ బిజీబిజీగా ఉండే నోరాకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వెస్టర్న్ డ్రెస్‌లో నోరా వేసే డ్యాన్ స్టెప్పులను చూడాలని ఆమె అభిమానులు వెర్రివారిలా ఎదురుచూస్తుంటారు.

అయితే ఇప్పుడు నోరా తన అవతారాన్ని మార్చేసింది. వెస్టర్న్ డ్రెస్సెస్‌ని వదిలేసిన సాంప్రదాయమైన బట్టలలో ఫోటోలకు ఫోజులిచ్చింది నోరా.

సాంప్రదాయమైన లుక్‌లో కూడా అమ్మడు చాలా బాగుందని చెప్పుకోవాలి. తెల్లటి షరారా సూట్‌లో నోరా అద్భుతంగా ఉంది. నోరా సింప్లిసిటీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

ఇంకా పింక్ డ్రెస్‌లో కూడా నోరా మెరిసింది. నోరా ఈ డ్రెస్‌తో చిన్న డైమండ్ ఇయర్ రింగ్స్ ధరించింది. చేతుల్లో అనేక ఉంగరాలు, ఓపెన్ హెయిర్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ఉన్నాయి.

ఈ ఫోటోలను నోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అంతేనా అభిమానుల గుండెల్లో పాతుకుపోతున్నాయి కూడా..

తన డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు పిచ్చెక్కించే నోరాకు ఇప్పుడు చాలానే ఆఫర్లు ఉన్నాయి. ఇక అమ్మడు చేసే స్పెషల్ సాంగ్స్‌కు రెమ్యూనరేషన్ దాదాపు 5 కోట్ల వరకూ ఉంటుందని బీటౌన్‌లో టాక్. సినిమాలే కాకుండా డ్యాన్స్ రియాల్టీ షోలలో కూడా నోరా జడ్జిగా వ్యవహరిస్తోంది.