
`రాజా - రాణి` మూవీతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన నజ్రియా ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

తమిళ మలయాళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ

ఇప్పడు తెలుగులో `అంటే సుందరానికి` చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.

ఈ మూవీ తెలుగు తమిళ మలయాళ భాషల్లో మాత్రమే విడుదల కాబోతోంది. జూన్ 10న మూడు భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న నజ్రియా నజీమ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

తెలుగులో తనకిది తొలి సినిమా కావడంతో తెలుగులో డబ్బింగ్ చెప్పి తన ప్రత్యేకతని చాటుకుంటోంది నజ్రియా.

చిన్న చిన్న సన్నివేశాలకు చిన్న చిన్న సౌండ్స్ ఇస్తూ నజ్రియా తన క్యూట్ నెస్ తో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. `అంటే సుందరానికి` మూవీలో నజ్రియా లీలా థామస్గా క్రిస్టియన్ యువతిగా కనిపించబోతోంది.