
దీపిక పదుకొనే కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రభాస్ కారెక్టర్‌ను చాలా ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్ చేసారు నాగ్ అశ్విన్. ట్రైలర్‌లోనే అది తెలిసిపోతుంది.

కల్కి సినిమా రిలీజ్ కావడానికి గట్టిగా నెల రోజులు కూడా లేదు. అందుకే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ప్రమోషన్లను కూడా రీజినల్ గా కాకుండా, వరల్డ్ వైడ్ బొంబాట్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

అదెందుకో ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఒక్కో ఫ్రేమ్ కోసం వాళ్లు పడిన కష్టం కనిపించింది. ప్రపంచానికి వచ్చే ఆపదను కాపాడే కథానాయకుడిగా ప్రభాస్ నటిస్తున్నారు. హీరోను సరైన మార్గంలో గైడ్ చేసే గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

మహాభారతంలోని రిఫరెన్సులతో పాటు.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల రిఫరెన్సులు కూడా సినిమాలో చాలానే కనిపిస్తున్నాయి. అవన్నీ అత్యున్నతంగా ఉండటం గమనార్హం. కల్కి షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకున్నారు.

పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఈ మూడు కాలాలకు లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగ్ అశ్విన్. అందులోనే అశ్వద్ధామ లాంటి ఇమ్మోర్టల్ కారెక్టర్ తీసుకుని.. అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు.