Mrunal Thakur: ఆ విషయం తెలియగానే మృణాల్ కి బ్రేకప్ చెప్పిన లవర్.. ఈ బ్యూటీ లవ్ స్టోరీలో ట్విస్ట్‌లు మాములుగా లేవుగా..

|

Oct 29, 2024 | 6:10 PM

నటనపై ఆసక్తి ఆ అమ్మాయిని సినీరంగంవైపు అడుగులు పడేలా చేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‏గా ఓ వెలుగు వెలుగుతుంది. బుల్లితెరపై సీరియల్లలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

1 / 6
కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత సూపర్ 30 అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తొలి చిత్రంలోనే బీటౌన్ స్టార్ హీరో హృతిక్ సరసన నటించింది.

2 / 6
ఈ సినిమా తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరించింది. కానీ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. హిందీలో షాహిద్ కపూర్ నటించిచన జెర్సీ సినిమాతోనూ నటిగా ప్రశంసలు అందుకుంది ఈ వయ్యారి.

3 / 6
ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో అలరించిన మృణాల్.. తెలుగులో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది.

4 / 6
ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అయితే మృణాల్ హీరోయిన్ అని తెలిసి ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడట. ఈ విషయాన్ని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

5 / 6
తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని తెలిపింది. పద్దతులు.. కట్టుబాట్లను ఎక్కువగా ఫాలో అవుతాడని.. తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని.. కానీ సినిమాల్లో నటిస్తానని తెలిసి తనను విడిచిపెట్టి పారిపోయాడని గుర్తుచేసుకుంది.

6 / 6
కానీ అతడిపై తనకు ఎలాంటి కోపం లేదని.. సర్దిచెప్పుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్పవని.. పెళ్లి తర్వాత గొడవలు రావచ్చని.. అందుకే బ్రేకప్ గురించి ఎక్కువగా ఆలోచించనని తెలిపింది.