
అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియెల్ 71వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రౌండ్‌లో అందమైన గిల్ట్రీ గౌనులో కనిపించిన ఈ భామ న్యాయ నిర్ణేతలతో పాటు అందరినీ ఆకర్షించింది.

గ్రాండ్ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్ మిస్ యూనివర్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

మాజీ విశ్వ సుందరి, భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు.. విశ్వసుందరి కిరీటాన్ని గాబ్రియెలాకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఈ పోటీల్లో మిస్ వెనిజులా అమందా దుదామెల్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 80కిపైగా దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న దివితా రాయ్..టాప్-5లో కూడా నిలవలేకపోయింది.

కాగా భారత్ నుంచి సుస్మితాసేన్ (1994), లారాదత్తా (2000), హర్నాజ్ సంధు (2021) విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.