
చాలా రోజుల తర్వాత మహేష్ బాబు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిశారు. ఓ వేడుక సందర్భంగా వీరంతా ఒకే చోట గెట్ టు గెదర్ అయ్యారు. మంజుల ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కొడుకు బాబీ కవల పిల్లల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యాడు మహేష్. నమ్రతతో పాటు మహేష్ అక్కాచెల్లెళ్లు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మంజుల భర్త సంజయ్ స్వరూప్, మహేష్ కోడలు భారతి, అల్లుడు అశోక్ గల్లా తదితరులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

సందర్భంగా బాజీ కుమారులను ఎత్తుకుని సరదాగా ఆడించారు మహేశ్ బాబు, నమ్రత. అలాగే అందరూ కలిసి ఫొటోలు కూడా దిగారు.

మహేష్ సోదరి మంజుల ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ 2027లో రిలీజ్ కానుంది.