Tollywood: కీర్తి సురేష్ నుంచి రష్మిక వరకు.. ఈ టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా.. ?

|

Jan 19, 2025 | 12:43 PM

దక్షిణాదిలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మీకు తెలుసా.. మన తెలుగు చిత్రపరిశ్రమలోని చాలా మంది హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందన్నా ఏం చదివారో తెలుసుకుందామా.

1 / 7
హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పుక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విద్యావంతులైన తారలలో ఒకరు. ఆమె జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కాలేజీ నుండి MBBS పట్టా పొందారు.

2 / 7
కీర్తి సురేష్.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు పెర్ల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్. అలాగే ఆమె స్కాట్‌లాండ్‌లో నాలుగు నెలల ఎక్సెంజ్ కార్యక్రమంలో పాల్గొని లండన్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.

3 / 7
రష్మిక మందన్నా.. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో సత్తా చాటుతుంది. రష్మిక MS రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ నుండి జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో నాలుగు సంవత్సరాల డిగ్రీని పొందారు.

4 / 7
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఆమె తల్లి గైనకాలజిస్ట్. దీంతో చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే కలలు కంది. సినిమాల్లో కెరీర్‌కు మారడానికి ముందు ఆమె 2021లో తన MBBSను విజయవంతంగా పూర్తి చేసింది.

5 / 7
 సమంత.. పాన్ ఇండియా హీరోయిన్. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రతిభకు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.  ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

6 / 7
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ అనుష్క. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె సినిమాల్లోకి ప్రవేశించే ముందు బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.

7 / 7
రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్, నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న రకుల్.. జీసస్ అండ్ మేరీ కాలేజీ నుండి గణితంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.