
భారీ బడ్జెట్‌తో, అసమానమైన స్టార్‌డమ్ ఉన్న హీరో.. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న చిత్రం. కానీ అదే సినిమా థియేటర్లలో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మూవీ కారణంగా నిర్మాతలకు లక్షలాది నష్టాలు వచ్చాయి. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైనప్పుడు కథలో మలుపు తిరిగింది. ఓటీటీలో ఈ మూవీ భారీ సంచలనం సృష్టించింది.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ లాభాలు రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీ ప్రపంచంలో, ఈ చిత్రం పరిస్థితులను మార్చివేసింది.

థియేటర్లలో ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ హర్రర్-కామెడీ చిత్రం డిజిటల్ విడుదల తర్వాత సంచలనం సృష్టించింది. ప్రభాస్ యాక్టింగ్, డైరెక్టర్ మేకింగ్ జనాలకు తెగ నచ్చేసింది. ప్రభాస్‌తో పాటు, ఈ చిత్రంలో నిధి అగర్వాల్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్ ను కొత్త అవతారంలో చూపించారు. అయితే ఈ చిత్రం VFX , సెట్ డిజైన్ పై నిర్మాతలు డబ్బు ఖర్చు చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ఈ సినిమా మొదట్లో థియేటర్లలో విడుదలైనప్పుడు, సమీక్షలు సానుకూలంగా వచ్చాయి.

ఓటీటీలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం రాత్రికి రాత్రే ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. సినిమాకి కూడా వెళ్లని ప్రేక్షకులు ప్రభాస్ హర్రర్-కామెడీని ఇంటి నుండే ఆదరించారు . ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.