
ముఖ నటి, నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ బుధవారం (నవంబర్ 1) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఐష్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఫన్నే ఖాన్ తర్వాత నాలుగేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఐష్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందినీగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

1973 నవంబర్ 1 న మంగళూరులో జన్మించింది ఐష్. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకు షిఫ్ట్ అయింది. మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే 1994లో మిస్ వరల్డ్ గా ప్రతిష్ఠాత్మక అందాల కిరీటం సొంతం చేసుకుంది.

ఇక మణిరత్నం, మోహన్ లాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వందలాది చిత్రాల్లో తన అందం, అభినయంతో మెప్పించారు. తన స్టార్ డమ్‌తో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

యితే సినిమాల్లో బిజీగా ఉండగానే అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది ఐష్. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. కాగా ఐష్ ఆస్తుల విలువ దాదాపు 800 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్లు తీసుకుంటోన్న ఆమె పలు బ్యూటీ బ్రాండ్‌లకు ప్రచార అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

ఇక ఐశ్వర్య 2015లో ముంబైలోని బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. దీని ధర సుమారు 21 కోట్ల రూపాయలు. ఈ ఇంట్లో ఐదు పడక గదులు ఉన్నాయి. వర్లీలో కూడా ఐశ్వర్యకు ఇల్లు కూడా ఉంది. దీని ధర సుమారు 41 కోట్ల రూపాయలు. ఇక రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8L వంటి అనేక లగ్జరీ కార్లు గ్యారేజ్‌లో ఉన్నాయి.

ఇక ఐశ్వర్య, అభిషేక్ లకు సంయుక్తంగా కోట్లాది ఆస్తులున్నాయి. దుబాయ్‌లో విశాలమైన విల్లాతో పలు విదేశాల్లో లగ్జరీ బంగ్లాలు కూడా ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ లోనూ ఐశ్వర్యరాయ్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన భర్త అభిషేక్ కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబైలోని ఓ లగ్జరీ హౌజ్‌లో ఉంటోంది. అమితాబ్ పేరు మీద ఉన్నీ ఈ బంగ్లా విలువ సుమారు రూ.112 కోట్లని తెలుస్తోంది.