Kannada Actors: చిన్న వయసులోనే ఆకస్మికంగా మృతిచెందిన శాండల్ వుడ్ హీరో హీరోయిన్స్..

|

Oct 30, 2021 | 7:53 AM

Kannada Actors: జీవితం అనూహ్యమైంది. ఎప్పుడు ఏ సమయంలో ఎం జరుగుతుందో ఎవరికీ తెలియదు. డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మరణం మన దరికి చేరిన తర్వాత తప్పించుకోలేం. చిన్నతనంలోనే ఆకస్మికంగా మరణిస్తే.. దీని ప్రభావం అధికంగా ఉంటుంది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో చిన్న వయస్సులోనే మరణించిన ప్రతిభావంతులైన కొంతమంది నటీనటుల గురించి తెలుసుకుందాం..

1 / 10
2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్(46) గుండె పోటుతో మృతి చెందారు. రాజ్‌కుమార్ హఠాన్మరణానికి కన్నడ రాష్ట్రం  దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ అకాల మరణానికి 
సంతాప సూచకంగా సినిమా షూటింగ్ లను నిలిపివేశారు. సినిమా థియేటర్ల మూసివేశారు.

2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్(46) గుండె పోటుతో మృతి చెందారు. రాజ్‌కుమార్ హఠాన్మరణానికి కన్నడ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ అకాల మరణానికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ లను నిలిపివేశారు. సినిమా థియేటర్ల మూసివేశారు.

2 / 10
కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటులలో ఒకరు చిరంజీవి సర్జా. కేవలం 39 సంవత్సరాలకే మరణించారు. 2020 జూన్ 7న గుండె పోటుతో మరణించారు. అప్పుడు అతని చేతిలో రెండు కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. చిరంజీవి యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. ప్రముఖ నటి మేఘనా రాజ్ ను పెళ్లిచేసుకున్నారు. ఆయన మరణం నుంచి ఇప్పటికీ సినీ పరిశ్రమ తేరుకోలేక పోయింది.

3 / 10
 స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగిన విజయ్ సంచారి. కన్నడ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో సైతం నటించిన సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

4 / 10
నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత శంకర్ నాగ్ కార్ ప్రమాదంలో చిన్న వయస్సులోనే మృతి చెందారు. శంకర్ నాగ్ ఆకస్మిక మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమలోనే కాదు.. కర్ణాటక ప్రజలు కూడా అత్యంత దురదృష్టకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనగా భావిస్తారు. శంకర్ చాలా డైనమిక్ పర్సన్. ఇప్పటికీ ఆయనకు రాష్ట్రంలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 1990 సెప్టెంబర్ 30న 36వ ఏట శంకర్ నాగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

5 / 10
2004 ఏప్రిల్ 17న బెంగళూరు నగర శివార్లలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రతిభావంతులైన నటి సౌందర్య. మరణించే సమయానికి సౌందర్యకు 31 ఏళ్లు. ఈ శాండల్ వుడ్ భామ టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన సౌందర్య. కన్నడ, తమిళ, మళయాళం సినిమాల్లో సైతం మంచి నటిగా పేరుపొందింది

6 / 10
90వ దశకంలో శాండల్‌వుడ్‌లో ఛార్మింగ్ హీరో సునీల్. కన్నడ పరిశ్రమలో ఆయనను 'చాక్లెట్ బాయ్' అని పిలిచేవారు. 
1994 జులై 24న బాగల్‌కోట్‌ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. కేవలం 30 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

90వ దశకంలో శాండల్‌వుడ్‌లో ఛార్మింగ్ హీరో సునీల్. కన్నడ పరిశ్రమలో ఆయనను 'చాక్లెట్ బాయ్' అని పిలిచేవారు. 1994 జులై 24న బాగల్‌కోట్‌ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. కేవలం 30 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

7 / 10
కన్నడంలో మంచి గుర్తింపు పొందిన నటి కల్పన. తమిళం, తులు, మళయాళం, తెలుగు సినిమాల్లో సైతం నటించిన కల్పన 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది.1979 మే 12న స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం.. ఆరోగ్య సమస్యలు, చేసిన అప్పులు అని టాక్ వినిపించింది.

8 / 10
కన్నడ హీరోయిన్లలో సూపర్ హిట్ సినిమాలతో.. సక్సెస్ సాధించిన నటిగా గుర్తింపు పొందిన నటి మంజుల. తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి 1986 సెప్టెంబర్ 12న ఓ ప్రమాదంలో మృతి చెందింది.  ఆమె లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె వయస్సు కేవలం 35 సంవత్సరాలు.

9 / 10
నివేదిత జైన్ 19 సంవత్సరాల వయస్సులో మరణించిన అతి పిన్న వయస్కురాలు. ఆమె 16 ఏట సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1994లో మిస్ బెంగుళూరు టైటిల్ విజేతగా నివేదిత నిలిచింది. ఆమె రాఘవేంద్ర రాజ్‌కుమార్ సరసన శివరంజిని మరియు శివ రాజ్ కుమార్ సరసన శివ సైన్యలో నటించింది.1998 మే 17న  ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి మృతి చెందింది.

10 / 10
 అనిల్(33) , ఉదయ్(32): ఈ ఇద్దరు నటులు ప్రతిభావంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. వీరి పూర్తి పేర్లు అనిల్ కుమార్ వేణుగోపాల్, ఉదయ్ రాఘవ్. 
2016 నవంబర్ 8న మాస్తి గుడి అనే సినిమా క్లైమాక్స్ స్టంట్స్ సీన్ చేస్తున్న సమయంలో ఇద్దరు నటీనటుల ప్రాణాలను తీసింది. ఈ షాకింగ్ సంఘటన ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో జరిగిన అత్యంత విషాద సంఘటనగా పరిగణించబడుతుంది.

అనిల్(33) , ఉదయ్(32): ఈ ఇద్దరు నటులు ప్రతిభావంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. వీరి పూర్తి పేర్లు అనిల్ కుమార్ వేణుగోపాల్, ఉదయ్ రాఘవ్. 2016 నవంబర్ 8న మాస్తి గుడి అనే సినిమా క్లైమాక్స్ స్టంట్స్ సీన్ చేస్తున్న సమయంలో ఇద్దరు నటీనటుల ప్రాణాలను తీసింది. ఈ షాకింగ్ సంఘటన ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో జరిగిన అత్యంత విషాద సంఘటనగా పరిగణించబడుతుంది.