
అందాల చిన్నది కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు దోచి, తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది.

లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఈ మూవీలో తన నటన, అందంతో మంచి ఫేమ్ సంపాదించుకొని టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

ముఖ్యంగా మగధీర సినిమాలో మిత్రవిందలా , ఓ యువరాణి పాత్రలో కనిపించి, తన నటనతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ అందుకుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ క్రేజీ, స్టార్ హీరోయిన్‌గా తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు లేకపోవడంతో వచ్చిన ప్రాజెక్స్స్ చేస్తూ తన ఫ్యామిలీకే సమయం కేటాయిస్తుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందులో రెడ్ కలర్ డ్రెస్‌లో ఈ బ్యూటీ చాలా క్యూట్‌గా ఉంది.