ఆయన చుట్టూ ఏదో శక్తి ఉంది. అందుకే ఆయన సెట్లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చేస్తోన్న వారు ఆయన్నే చూస్తుంటారు. ముఖ్యంగా ఆయన రిహార్సల్స్ చేసేప్పుడు చాలా బాధ్యతగా, ఆనందంగా చేస్తారు. ఈ సినిమా చేస్తూ ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకోచ్చింది.
ఈ సినిమా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది కనుక నేను ఎక్కువగా రాజసం ఉట్టిపడే దుస్తుల్లోనే కనిపిస్తాను. అంతేకానీ జీన్స్ లో కనిపించను. నన్ను నేను స్క్రీన్ పై చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
Nidhi Agarwal 5
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్.
గత అక్టోబర్ నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీగా ఉంటున్నాను.
జర్నీ చేసిన ప్రతిసారీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికి దాదాపు 35సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా అంటూ చెప్పుకోచ్చింది.