
మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజైన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

ముఖ్యంగా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇరుముడి నిలిచింది. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర అద్భుతంగా నటించింది. సినిమాలో రవితేజ, నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

కాగా ఇదే ఇరుముడి సినిమాలో మరో అమ్మాయి కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. గురు స్వామి సాయి కుమార్ కూతురు గాయత్రి పాత్రలో నటించిన అమ్మాయి తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో అందరి ప్రశంసలు అందుకుంది. ఇరుముడి సినిమా తర్వాత ఈ అమ్మాయి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ అమ్మాయి అసలు పేరు సామ్. గతంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం, బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ డాకు మహారాజ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది సామ్.

ఇక మ్యాడ్ స్వ్కేర్ సినిమాలోనూ మెరిసింది సామ్. అయితే ఇరుముడి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

. ఈ ఫొటోల్లో లంగా ఓణీలో చాలా ట్రెడిషినల్ గా క్యూట్ లుక్స్ లో కనిపించింది సామ్. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'సో క్యూట్, బ్యూటిఫుల్' అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.