కంగన రనౌత్, కాంట్రవర్సీ.. ఈ రెండింటినీ విడదీసి చూడలేమేమో..? ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో వార్తల్లో ఉండే కంగన.. ఇప్పుడు ఎమర్జెన్సీతో మరోసారి హైలైట్ అవుతున్నారు. ఈమె నటించిన కొత్త సినిమాకు సెన్సార్ దగ్గరే కాదు.. హై కోర్టు దగ్గర కూడా చిక్కులు తప్పట్లేదు. అసలు ఎమర్జెన్సీని ఎందుకు ఆపుతున్నారు..? అసలు అది బయటికి వస్తుందా..? కంగన రనౌత్ ఏం చేసినా సంచలనమే.!
తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని.. సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉందనీ.. వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది.
ఎమర్జెన్సీ సినిమాకు కష్టాలు తొలిగిపోయినట్లేనా..? కంగనా రనౌత్ కలల సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందా..? సెన్సార్ చిక్కులు.. కోర్టు సమస్యల నుంచి ఎమర్జెన్సీకి ఊరట లభించిందా.? తాజాగా బాంబే హై కోర్టులో ఏం జరిగింది.?
సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ.. సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది.
కంగన సినిమాపై కోర్ట్‌కు సెన్సార్ బోర్ట్ ఏం చెప్పింది..? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి..? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హై కోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి.
మధ్యప్రదేశ్ హై కోర్టు కూడా వాళ్ళ మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌కు సూచించింది. అక్కడ్నుంచే ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబుల్ అయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని తాము ఆదేశించలేమని బాంబే హై కోర్టు తీర్పునిచ్చింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు CBFCకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వులను గౌరవించాలని ముంబై హై కోర్ట్ తీర్పునివ్వడమే కాకుండా.. సెప్టెంబర్ 18 నాటికి సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 19న జరగనుంది.