
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్.

ఈ సినిమాలో మోడ్రన్ గానే కాకుండా.. హోమ్లీగానూ కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ

అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే

తమిళ్ లో మాత్రం ఈ బ్యూటీ బిజీగానే ఉంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడికి ఎదురైన రెండు అనుభవాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో క్యాబ్ బుక్ చేసుకోవటం.. క్యాబ్ లోకి ఎక్కిన తర్వాత ఏసీ ఆన్ చేయమంటే డ్రైవర్ ఆన్ చేయలేదట..పెట్రోల్ ధరలు పెరగటంతో ఏసీ ఆన్ చేసేందుకు నో చెప్పాడట అతడు.

అలాగే ఎయిర్ పోర్టులోఒక వ్యక్తి తనను గుర్తించి సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలో కావాలని కోరినట్లు పేర్కొంది.

అయితే.. తాను మాత్రం సున్నితంగా రిజెక్టు చేయగా.. నేను మిమ్మల్ని ఫాలో అవుతానని అతను చెప్పినట్టు పేర్కొంది.