ఖాన్‌ల సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి వచ్చాయంటే ఆనందించాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కావడం లేదంటున్నారు శ్రద్ధా కపూర్. సక్సెస్ అంటే ఇలా ఉండాలి.
జీవితాంతం గుర్తుండిపోయేలా అంటూ వస్తున్న మెసేజ్‌లు చూస్తుంటే కడుపునిండిపోతుందట సాహో బ్యూటీకి. అప్పుడెప్పుడో డార్లింగ్ ప్రభాస్‌తో సాహో చేసిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
కానీ, నార్త్ లో మాత్రం ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. మరి అంత క్రేజ్ ఉన్న ఆ అమ్మణిని సౌత్ మేకర్స్ అప్రోచ్ కాలేదా అనే డిస్కషన్ షురూ అయింది.
ఏడాదికి పది సినిమాలు అక్కర్లేదు.. అప్పుడప్పుడూ స్త్రీ2 లాంటి సినిమాలు చేస్తే చాలనే ఫీలింగ్ వచ్చిందంటున్నారు శ్రద్ధాకపూర్. స్త్రీ2కి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతుంటే,
వారిని చూసి సంబరపడుతున్నానని అంటున్నారు శ్రద్ధా కపూర్. పెద్ద స్టార్లు అక్కర్లేదు. చెప్పాలనుకున్న కథని ఆసక్తికరంగా చెబితే చాలు.. జనాలు ఆదరిస్తారనే విషయం స్త్రీ2తో మరోసారి ప్రూవ్ అయింది.
అందుకే నియర్ ఫ్యూచర్‌లో స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నానని అంటున్నారు శ్రద్ధ. స్త్రీ2 సక్సెస్ చూశాక, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడని అందరూ అడుగుతున్నారట ఈ భామని.
అందరిలాగానే తాను కూడా ఫ్రాంఛైజీని కొనసాగించే కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు శ్రద్ధా కపూర్. సో.. త్వరలోనే స్త్రీ3 ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.