
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈ చిన్నది తాజాగా సింపుల్ లుక్‌లో కనిపించి, అందరినీ ఆశ్చర్య పరిచింది.

ముంబైకి చెంది ఈ బ్యూటీ హిట్ల కంటే ప్లాప్స్ ఎక్కువ అందుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు, ఓదెల 2 మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

హెబ్బా పటేల్ అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అంతే కాకుండా యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ బ్యూటీ. అంతలా తన అందంతో మాయచేసింది. ఇక ఈ మూవీ తర్వాత హెబ్బాకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ వచ్చి సినిమాలు అన్నీ ప్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయి, ఈ బ్యూటీ క్రేజ్ కూడా పోయింది.

దీంతో ప్రస్తుతం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా సింపుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది