
నిన్న మొన్నటి వరకు హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో స్పస్పెన్స్ కంటిన్యూ అయ్యింది. మార్చి డేట్ మిస్ అయిన తరువాత మే 9న రిలీజ్ అని ప్రకటించినా... ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ ఎక్కడో రిలీజ్ విషయంలో అనుమానాలు ఉన్నట్టుగా అనిపించింది.

ఫైనల్‌గా రిలీజ్ విషయంలో తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చింది యూనిట్. 'పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది, డబ్బింగ్, రీ రికార్డింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయ'ని ప్రకటించింది. కొత్త పోస్టర్‌తో మరోసారి రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసింది.

పవన్ ఎంట్రీతో అదే డేట్‌కు రావాలనుకున్న మాస్ జాతర, సింగిల్ సినిమాల రిలీజ్ డైలమాలో పడింది. మరి పవర్ స్టార్‌తో పోటీ అంటే రిస్క్ ఉంటుంది కదా మరి. అందులోనూ చాల రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా. దీని కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చాలామంది సినీ ప్రేముకులు కూడా వెయిట్ చేస్తున్నారు.

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాను పవన్‌తో పోటికి దించితే రిస్కే. అందుకే పవన్ ఎంట్రీ కన్ఫార్మ్ అయితే మాస్ జాతర బరి నుంచి తప్పుకోవటం దాదాపు ఖాయమే.

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న సింగిల్ అసలు పోటిలో ఉండే ఛాన్సే లేదు. అల్లు అరవింద్ సమర్ఫణలో వస్తున్న ఈ సినిమాను పవన్‌కు పోటిగా తీసుకువచ్చే అవకాశమే లేదు. సో... పవన్ ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది కాబట్టి... మాస్ జాతర, సింగిల్ సినిమాలు కొత్త డేట్స్ కోసం ట్రై చేసుకోక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.