Phani CH |
Nov 30, 2022 | 1:23 PM
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది.
స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది.
ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమా ‘ఊహలు గుసగుస లాడే’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాశి ఖన్నాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంతకన్నా ముందు అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించింది.
ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా కొందరు హీరోయిన్స్ కి తెలుగు రాదు, రాశి ఖన్నా మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు నేర్చుకోవడం కాకుండా పాటలు కూడా పడింది.
తెలుగుని చాలా బాగా మాట్లాడే అతితక్కువ మంది హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న రాశి ఆ తర్వాత స్లిమ్ అయ్యి తన యాక్టింగ్ స్కిల్స్ కి గ్లామర్ ని కూడా తోడయ్యేలా చేసింది.
1990 నవంబర్ 30న పుట్టిన రాశి ఖన్నా నేటితో ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక 2013 నుంచి హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా, 2018లో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ అయిదు సినిమాల్లో నటించింది.
రాశి ఖన్నా ఇప్పటివరకూ 30 సినిమాల్లో నటించగా అందులో ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘ఊహలు గుసగుస లాడే’, ‘ప్రతి రోజు పండగే’, ‘సుప్రీమ్’ సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.