Phani CH |
Jan 06, 2023 | 9:55 AM
‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరియమైంది అందాల భామ హెబ్బా పటేల్. ఫస్ట్ సినిమాకే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది హెబ్బా పటేల్.
ఆ తర్వాత వరుసగా ఆ తరహా పాత్రలతోనే కంటిన్యూ అయ్యింది. పక్కా గ్లామర్ అండ్ బబ్లీ రోల్స్‌లో మెప్పించింది హెబ్బా పటేల్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి కొన్ని సూపర్ హిట్లు కూడా హెబ్బా ఖాతాలో వున్నాయ్.
కాగా ఇటీవల ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన హెబ్బా పటేల్, పెద్ద తెరపై ఇంతవరకూ తనపై వున్న బోల్డ్ ముద్రను చేరిపేసేలా చేసింది.
డీ గ్లామర్ రోల్‌లో పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తోనూ తాను మెప్పించగలనని ప్రూవ్ చేసుకుంది. అది సరే కానీ, గ్లామర్ ఇమేజ్ తెచ్చుకోవడం కూడా ఏమంత ఈజీ కాదండోయ్.
ఇమేజ్ రావడం ఈజీనే కానీ, దాన్ని నిలబెట్టుకోవడమే కూసింత కష్టమైన పని. అందుకే ఆ పనిలోనూ ఎప్పుడూ అడ్వాన్స్‌డ్‌గా వుంటుంది హెబ్బా పటేల్.
తన ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హెబ్బా పటేల్ హవా నడిపిస్తోంది.
గ్లామర్ పరంగా యువతకు పిచ్చెక్కించేలా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తోంది హెబ్బా. కుర్రకారు కలల రాణిలా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందాల వడ్డన కానిస్తోంది.
అందం, అందుకు తగ్గ అభినయం, ఆ అందాన్ని ఆరబోసే ధైర్యం ఉన్నప్పటికీ దర్శకనిర్మాతల చూపు హెబ్బాపై పడటం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో హెబ్బా సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది హెబ్బా.
ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఊపు తెప్పించే స్టెప్పులేసింది హెబ్బా. రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసి యువతను హుషారెత్తించింది. ఛాన్స్ వస్తే ఐటెం సాంగ్ చేయడానికైనా సిద్దమే అంటున్న హెబ్బా పటేల్.. ఎలాగోలా తన కెరీర్‌ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని తెగ శ్రమిస్తోంది.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ పలు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది హెబ్బా. రోల్ ఎలాంటిదైనా అందులో లీనమవుతూ తన టాలెంట్ బయటపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే నాజూకుగా తయారై కవ్విస్తోంది.