Guntur Karam: రమణగాడి దెబ్బకు ఓవర్సీస్ గల్లంతు.. గుంటూరు కారం రికార్డ్స్ మోత..!

| Edited By: Prudvi Battula

Jan 13, 2024 | 10:25 AM

సంక్రాంతి సినిమాల గురించి చర్చ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఏ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది.. ఎవరు ముందున్నారు.. ఎవరు తర్వాత ఉన్నారు.. ఎవరు చివర్లో ఉన్నారు అనే టాక్ అన్నిచోట్లా జరుగుతుంది. లోయస్ట్ ఎవరున్నది పక్కనబెడితే.. హైయ్యస్ట్ మాత్రం అన్ డౌటెడ్‌గా గుంటూరు కారం ఉంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కోసం మన దేశంలో మాత్రమే కాదు.. పక్క దేశంలో ఉన్న ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూసారు.

1 / 5
ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టేస్తున్నారు మహేష్, త్రివిక్రమ్. 2024 సంక్రాంతి కానుక‌గా జనవరి 12న విడుదలైన గుంటూరు కారం ఓవర్సీస్ షోస్ గురించి చర్చ భారీగా జరుగుతుంది. ముఖ్యంగా మహేష్ బాబుకు ఓవర్సీస్ మార్కెట్ ముందు నుంచే ఎక్కువ. ఖలేజా నుంచే ఆయన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాసాయి.

2 / 5
మరోవైపు త్రివిక్రమ్ సినిమా అంటే కూడా అక్కడి ఆడియన్స్‌కు మహా మోజు. ఇప్పుడిద్దరూ కలిసి వచ్చారు.. దాంతో ఇంకేమైనా ఉందా..? అందుకే గుంటూరు కారం కోసం ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు పడనన్నీ షోస్ వేశారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 5,408 ప్రీమియ‌ర్ షోలు వేసినట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

3 / 5
తెలుగు ఇండస్ట్రీ నుంచి ట్రిపుల్ ఆర్ సినిమాకు 5408 ప్రీమియర్స్ పడితే.. ఆ తర్వాత సలార్ ఉండేది. దీనికి 2500 ప్లస్ షోస్ పడ్డాయి. ఇఫ్పుడు గుంటూరు కారంకు ఏకంగా ట్రిపుల్ ఆర్ కంటే ఎక్కువగా షోస్ ప్లాన్ చేసిన అది కుదర్లేదు. దాంతో ఓపెనింగ్ కూడా అలాగే ఉంటుందని అర్థమవుతుంది.

4 / 5
విడుదలకు వారం ముందే 5 లక్షల డాలర్లు వసూలు చేసింది గుంటూరు కారం. మ‌హేష్ బాబు డాన్సులు, ఫైట్లు ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి అనే చెబుతున్నారు అక్కడి అభిమానులు. ఎలా చూసుకున్నా కూడా ఓ రీజినల్ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ అయితే గుంటూరు కారం పేరు మీద ఉండటం ఖాయం అయిపోయింది.

5 / 5
గుంటూరు కారం USA మరియు కెనడాలో $1.5 మిలియన్లు వసూల్ చేసింది. దీనితో కలుపుకొని ఓవర్సీస్‌ $2 మిలియన్లు (రూ. 16.6 కోట్ల) గ్రాస్ వసూలు చేసింది. ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్ 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా 41.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.