Tollywood: ఫస్ట్ సినిమా హీరోతో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే.. టాలీవుడ్ సెన్సేషన్..

Updated on: Feb 15, 2025 | 2:47 PM

సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. తల్లితో కలిసి ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది.

1 / 5
ఒకప్పుడు ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందం, అమాయకత్వం.. అంతకు మించిన అల్లరితనంతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన ఫస్ట్ మూవీ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

2 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. జెనీలియా. 1987 ఆగస్ట్ 5న ముంబైలో జన్మించిన ఈ అమ్మడు తుఝే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్) సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

3 / 5
ఈ సినిమాలో బీటౌన్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

4 / 5
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

5 / 5
సిద్ధార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో తన అద్భుతమైన నటనతో మెప్పించింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.