డిప్యూటీ సీఎం ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరవకండి.. సకాలంలో సినిమాను విడుదల చేస్తాం. పర్ఫెక్ట్ గా షూట్ కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం అని ఆల్రెడీ అనౌన్స్ చేసింది ప్రొడక్షన్ హౌస్.
కలలో కూడా ఊహించని విజయాలతో పాటు.. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే శక్తిగా నిలిచారు జనసేనాని. ఇవన్నీ ఉండగానే తాజాగా మరో సంచలనం సృష్టించారు పవర్ స్టార్.
మరి ఆయన సాధించిన ఆ విజయమేంటి.? పవన్ కళ్యాణ్ సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయాల్లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదిప్పుడు.
ఇప్పుడు ఇదే విషయాన్ని పవర్‌స్టార్ కూడా ప్రస్తావించారు. ఓజీ.. ఓజీ అని ఫ్యాన్స్ భయపెడుతున్నారంటూ పవర్‌స్టార్ చెప్పిన మాటలు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాదిలో పవన్ గురించి తెలుసుకోడానికి నెటిజన్లు పోటీ పడ్డారు. ఏపీ ఎన్నికలు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఏ పవన్ నహీ హే.. ఆంధీహై అంటూ ప్రధాని మోడీ ప్రశంసలు..
రాజకీయంగా పవన్ పోరాడుతున్న విషయాలు.. ఇవన్నీ ఆయనెవరు అని దేశవ్యాప్తంగా అందరూ సర్చ్ చేసేలా ప్రేరేపించాయి. భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, ఇండియన్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మొదటి 4 స్థానాల్లో నిలిచారు.
వీలున్నప్పుడు కాల్షీట్ ఇచ్చి సినిమాలు కంప్లీట్ చేస్తానన్నది పవన్ కల్యాణ్ మాట. ఆయనకు కుదిరినప్పుడే కాల్షీట్ ఇచ్చినా 2025లో ఓజీ కంప్లీట్ అవుతుందన్నది ఫ్యాన్స్ అంచనా.
చెప్పినట్టు సమ్మర్‌కి హరిహరవీరమల్లుతో వచ్చేయాలని ఫిక్సయ్యారు పవన్. 80, 90ల్లో జరిగే పీరియాడిక్ కథతో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్. ఈ సినిమా ఇచ్చే రిజల్టును బట్టి, ఓజీని డిజైన్ చేయాలని ఫిక్సయ్యారు సుజీత్.