ఐపీల్ ఫౌండర్ గా.. మాజీ చైర్యన్‌గా.. మనీ లాండరింగ్ నిందుడిగా.. దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడైన లలిత్ మోదీ.. లేటు వయసులో.. గాటు ప్రేమను కనిపెట్టారు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్‌తో ప్రేమలో పడినట్టు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.
తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి అందర్నీ షాక్ చేశాడు. 'మై బెటర్ హాఫ్' అంటూ ముందు హడావిడి చేసి.. ఆ తరువాత జెస్ట్ డేటింగ్ మాత్రమే చేస్తున్నాం అంటూ.. క్లారిటీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్ లో స్ట్రాంగ్ అండ్ ఇండివిడ్జ్యూవల్ ఉమెన్ గా పేరున్న సుస్మిత.. ఇంతకు ముందు చాలా మందితో ప్రేమ వ్యవహారం నడిపించారు.
నడిపించడమే కాదు.. పెళ్లి వరకు వెళ్లారు. కాని ప్రియారిటీస్ పేరుతో.. వెనక్కి వచ్చి మరో రిలేషన్‌తో బీ టౌన్ లో వైరల్ అయ్యేవారు. అయితే ఇప్పటి వరకు సుస్మిత ఎవరెవరిని డేట్ చేసిందో తెలుసుకుందాం..!
రోహ్మన్ శావ్లా: ఫ్యాషన్ వరల్డ్ లో యంగ్ అండ్ డైనమిక్ మోడల్ రోహ్మన్ శావ్లా. ఓ ఫ్యాషన్ వీక్‌లో పరిచయం అయిన రోహ్మాన్ తో 2019లో ప్రేమలో పడ్డారు సుస్మిత. ప్రేమలో పడడమే కాదు.. అతనితో సహజీవనం కూడా చేశారు. కాని రీసెంట్‌గా బ్రేకప్ చెప్పి.. సుస్మిత సింగిల్ అయిపోయారు. అయినప్పటికీ రోహ్మాన్ తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని అంటున్నారు సుస్మిత.
రణ్ దీప్ హుడా: రణ్ దీప్ హుడా బాలీవుడ్ లో హీరోగా ఎదుగుతున్న క్రమంలో.. సుస్మితా సేన్ ప్రేమలో పడి చాలా పాపులర్ అయ్యాడు. కాని చాలా తక్కువ టైంలోనే.. బ్రేకప్ చెప్పి తన కెరీర్‌లో బిజీ అయిపోయాడు. అంతేకాదు.. ఓ షోలో సుస్మితతో విడిపోవడమే చాలా గొప్ప విషయం అంటూ చెప్పి బీటౌన్‌ని షాక్ చేశాడు.
విక్రమ్ భట్: ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా పాపులర్ అయిన విక్రమ్ భట్ తో కూడా ప్రేమాయనం సాగించారు సుస్మిత. ఇక 'దస్తక్' సినిమా సెట్‌లో మొదలైన వీరి ప్రేమ చాలా కొద్ది రోజుల్లోనే ఎండ్ అయిపోయింది.
ముదస్సర్ అజీజ్: 'దుల్హా మిల్ గయా' సినిమా చేస్తున్న సమయంలోనే.. ఆ సినిమా డైరెక్టర్ ముదస్సర్ అజీజ్ తో ప్రమలో పడింది సుస్మిత. అయితే కొంత కాలం కలిసి ఉన్న వీరు కొన్ని కారణాల వల్ల విడిపోయారని బీ టౌన్‌లో న్యూస్ లీకైంది.
బంటీ సజ్దేహ్: ధర్మా కార్నర్‌స్టోన్ ఏజెన్సీ CEO అండ్ సీమా ఖాన్ సోదరుడు బంటీ సజ్‌దేహ్ కూడా సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ లో ఓ వార్త చెక్కర్లు కొట్టింది. కాని ఇదంతా.. వట్టి పుకారే అని కొట్టిపారేశారు సుస్మితా సేన్.
సంజయ్ నారంగ్ : హోటల్ బిజినెస్ చేస్తున్న సంజయ్ నారంగ్‌తో కూడా ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో సుస్మిత సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. సంజయ్ తనకు ప్రపోజ్ కూడా చేశాడని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు చెప్పింది. అయితే అంతా ఓకే అనుకున్న టైంలోనే.. బ్రేకప్ చెప్పానని మరో ట్వీట్ చేసింది సుస్మిత.
వసీం అక్రమ్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వసీం అక్రమ్ తో కూడా సుస్మితా డేట్ చేసినట్టు అప్పట్లో ఓ న్యూస్ బీ టౌన్ లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టే..వీరు కలిసి తిరగడాన్ని కూడా మీడియా బయటపెట్టింది. కాని ఇదంతా వట్టి పుకారంటూ.. కొట్టిపారేశారు సుస్మితా.
షబీర్ భాటియా: హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు షబీర్ భాటియాతో సుస్మిత రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే కొద్దిరోజులకే సుస్మిత ఆ సంబంధానికి స్వస్తి చెప్పారని న్యూస్ బయటికి వచ్చింది.
ఇంతియాజ్ ఖత్రీ: ఓ ఫ్యాషన్ షోకి వెళ్లిన సుస్మితా.. అక్కడ బిజినెస్ మ్యాన్ ఇంతియాజ్ ఖత్రీ తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. అంతే ఇక అప్పటి నుంచి ఒకరినొకరు కలుసుకుంటూ.. చివరికి ప్రేమలో పడ్డారు. ఇక ఎప్పటిలాగే కొన్ని రోజులకే విడిపోయారు.
రితికా భాసిన్: స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్, సాగరిక ఘట్గేల వివాహ సమయంలో రితిక్ భాసిన్తో కనిపించారు సుస్మిత. ఆ తరువాత కూడా వారు చాలా సంర్బాల్లో మీడియా కంట పడ్డారు. అయితే దాదాపు 4 సంవత్సారాల ప్రేమ తరువాత వారు విడిపోయారని బాలీవుడ్ లో టాక్.