Mamitha Baiju : ఏంటీ.. మమితా బైజు అసలు పేరు ఇది కాదా.. ? బర్త్ సర్టిఫికెట్ చిన్న పొరపాటు.. క్రేజీ న్యూస్ వైరల్..

Updated on: Nov 02, 2026 | 1:36 PM

ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషన్ మమితా బైజు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు ఈ అమ్మడు నటించిన సినిమాలు థియేటర్లలో వరుసగా వంద కోట్లకు పైగా వసూళ్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా తన పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది మమితా.

1 / 5
వెండితెరపై కొందరు నటీమణులు తమ సహజమైన నటన, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంటారు. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ మమితా బైజు సరిగ్గా అలాంటి కోవకే చెందుతారు. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ అసలు పేరు వెనుక ఒక ఆసక్తికరమైన, అనుకోని కథ దాగి ఉంది.

2 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత తన పేరు మార్పు వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచారు. మమితా బైజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన అసలు పేరు 'నమిత'. ఎంతో ఆలోచించి ఈ పేరును ఎంచుకున్నప్పటికీ, ఆ తర్వాత బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న ముద్రణా పొరపాటు వల్ల ఆ పేరు కాస్తా 'మమిత'గా మారిపోయింది.

3 / 5
చిత్రమేమిటంటే, ఈ చిన్న తప్పును ఆమె కుటుంబసభ్యులు నాలుగైదు సంవత్సరాల వరకు గమనించలేకపోయారట. చిన్నారి మమితను పాఠశాలలో చేర్పించేందుకు రికార్డులను పరిశీలించినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే అధికారిక పత్రాల్లో ఆ పేరే ఖరారు కావడంతో, మార్చడం కుదరక విధిలేక ఆ పేరునే కొనసాగించాల్సి వచ్చింది. అలా అనుకోకుండా జరిగిన ఆ టైపోగ్రాఫ్రికల్ పొరపాటే ఆమెను 'మమిత'గా మార్చేసింది.

4 / 5
మలయాళంలో వచ్చిన 'ప్రేమలు' సినిమా మమితా బైజు కెరీర్‌ను పూర్తిగా మార్చివేసింది. ఆ చిత్రంతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన ఆమె ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. 'విశ్వనాథ్ & సన్స్', 'జన నాయగన్' వంటి పలు చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో నటించిన చిత్రాలు భారీ వసూళ్లు సాధించడంతో ఆమె 'బాక్సాఫీస్ క్వీన్'గా మారింది.

5 / 5
ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ , మాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతున్న మమిత, అనుకోకుండా వచ్చిన ఆ పేరుతోనే ఇండస్ట్రీలో గోల్డెన్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోవడం విశేషం. మమితా 2017లో వచ్చిన ‘సర్వోపరి పాలక్కారన్’ అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘హనీ బీ 2’, ‘సూపర్ శరణ్య’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us