మాజీ మిస్ యూనివర్స్, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో ఆమె ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు, ఫొటోలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
సుస్మితా సేన్ కోట్ల ఆస్తికి యజమాని. నివేదికల ప్రకారం, సుస్మితా సేన్ ఏడాదికి సుమారు రూ. 9 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. అంటే నెలకు సుమారు రూ. 60 లక్షలు సంపాదిస్తుంది.
ఇక సుస్మితకు దాదాపు రూ.74 కోట్ల నికర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని వెర్సోవాలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఆమె తన కూతుళ్లతో కలిసి నివసిస్తోంది.
ఈ మాజీ మిస్ యూనివర్స్ గ్యారేజ్‌లో పలు లగ్జరీ వాహనాలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత ఖరీదైన BMW 7 సిరీస్ 730 LDని కారు కూడా ఒకటి. దీని ధర సుమారు రూ. 1.42 కోట్లు. అలాగే కోటి రూపాయల ఖరీదు చేసే బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారు కూడా ఆమె వద్ద ఉంది.
సుస్మితా సేన్ ప్రధాన ఆదాయ వనరులు ఆమె సినిమాలే. ఒక సినిమాకు గానూ ఆమె 3-4 కోట్లు తీసుకుంటుంది. ఇక ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం సుమారు రూ. 1.5 కోట్లు తీసుకుంటుందని సమాచారం.