
పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ని గుర్తుపట్టారా..? ఆమెను నటనకు.. అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

ఇంతకూ పై ఫొటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీ సూపర్ స్టార్ నయనతార. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన నయన్.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది.

తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. తెలుగులోనూ అదరగొట్టింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్.

ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్. రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. నయనతార 2003లో మలయాళ చిత్రం మనసినకరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజా రాణి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మడు ఆచి తూచి సినిమాలు చేస్తోంది. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది.