
అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అనేది మాత్రం అందుకోలేకపోతుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొంతమంది ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ అందుకోలేకపోతున్నారు.

మరికొందరు మాత్రం తొలి చిత్రానికే హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రావట్లేదు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఇప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేదు.

కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హీరోలతో కలిసి నటించింది. కానీ ఆతర్వాత ఈ చిన్నది హిట్స్ అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది, చిన్న చిన్న పాత్రలు చేసింది ఆయన కూడా ఈ భామకు హిట్ మాత్రం అందని ద్రాక్షగా మారింది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ హిట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది. 12 సినిమాలు చేసిన ఈ అమ్మడు కేవలం 2 హిట్స్ మాత్రమే అందుకుంది.