
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇందులో ఆషిక రంగనాథ్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓప్రాజెక్ట్ చేస్తున్నారు చిరంజీవి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అయితే మీకు తెలుసా.. చిరంజీవికి ఓ హీరోయిన్ చెల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో.. ?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమె లేడీ సూపర్ స్టార్. హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె మరెవరో కాదండి.. నయనతార. తెలుగుతోపాటు తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే జవాన్ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

గతంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి భార్యగా నటించింది. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు చెల్లిగా కనిపించింది నయన్. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో మరోసారి చిరుతో జత కడుతుంది. అలాగే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం చిరు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాగే అటు సోషల్ మీడియాలోనూ న్యూలుక్స్ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. అలాగే నిత్యం కఠిన వర్కవుట్స్ చేస్తూ ఫిట్నెస్ విషయంలోనూ షాకిస్తున్నారు చిరు.