
టూరిస్ట్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చిన్న పాత్రలో కనిపించి తెగ ఫేమస్ అయ్యింది ఓ అమ్మాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో తెలుసా.. ?

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో చిన్న పిల్లాడిగా నటించిన కమల్ జగదశ్ కాకుండా ప్రధాన పాత్రధారి ధర్మదాస్.. ఇంటి యజమాని కూతురిగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ యువతకు ఈ బ్యూటీ తెగ నచ్చేసింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

ఈ చిత్రంలో ఆమె నటనకు అడియన్స్ ముగ్దులు అవుతున్నారు. ఈ బ్యూటీ అసలు పేరు యోగలక్ష్మీ. చూడటానికి డస్కీగా ఉన్నప్పటికీ ఆమె నటనకు అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇందులో ఆమె ప్రపోజల్ సీన్ ను మరీ మరీ చూస్తున్నారు. యోగలక్ష్మీ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.

ఇదివరకే తమిళంలో హార్ట్ బీట్, సింగపెన్నె వంటి వెబ్ సిరీస్ చేసింది. కానీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ షార్ట్ ఫిల్మ్ లోనూ నటించింది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే సినీరంగంలో పాపులర్ అవుతుంది.

టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత యోగలక్ష్మీకి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్. అటు గ్లామరస్ గా కనిపిస్తూనే.. ఇటు చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని లేటేస్ట్ స్టన్నింగ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.