Tollwyood : డైరెక్టర్ నాగ్ అశ్విన్ లక్కీ ఛార్మ్ ఈ అమ్మడు.. నాన్న కోసమే హీరోయిన్ అయ్యా..

Updated on: Mar 29, 2026 | 11:19 AM

సాధారణంగా సినీరంగంలో నటిగా ఓ వెలుగు వెలగాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇస్తుంటారు చాలా మంది ముద్దుగుమ్మలు. కొందరు సక్సెస్ అవుతే.. మరికొందరు మాత్రం తక్కువ సమయంలోనే గుడ్ బై చెప్పేస్తుంటారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేశారు. తన తండ్రి కోసమే సినిమా హీరోయిన్ అయ్యానని తెలిపింది.

1 / 5
సినీరంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని కట్టిపడేసింది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా.. పాత్రలో లోతు ఉన్న కథలను ఎంచుకుంటూ నటిగా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

2 / 5
దాదాపు పదేళ్లుగా సినీరంగంలో హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గుర్తిండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది. విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలతో మొదటి చిత్రంతోనే అవకాశం అందుకుంది. ఆమె డైరెక్టర్ నాగ్ అశ్విన్ లక్కీ ఛార్మ్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

3 / 5
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ మాళవిక నాయర్. ప్రస్తుతం శర్వానంద్ సరసన బైకర్ చిత్రంలో నటిస్తుంది. ఢిల్లీలో జన్మించిన ఈ అమ్మడు కొచ్చిలో పెరిగింది. చిన్నప్పటి నుంచే  సైన్స్ సబ్జెక్టుపై ఇష్టం పెంచుకున్న ఈ అమ్మడు.. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి)కావాలని కలలు కనేవారట. స్కూల్ రోజుల్లోనే స్విమ్మింగ్ లో పతకాలు సాధించిందట.

4 / 5
 మాళవిక నాయర్ తండ్రికి నటుడిగా కావాలనే కోరిక ఉండేదట. తనకు ఆ కోరిక తీరకపోవడంతో తన కుమార్తెను వెండితెరపై చూడాలని ఆశపడ్డారట. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫోటోస్ చూసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా  ఫోన్ చేసి ఎవడే సుబ్రహ్మణ్యం కథను పంపించారని... ఆ కథ విన్న తన తండ్రి కచ్చితంగా సినిమా చేయాలని చెప్పడంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

5 / 5
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తెలుగులో విభిన్న కంటెంట్ చిత్రాలతో మెప్పిస్తుంది. నాగ్ అశ్విన్ ఈ అమ్మడును లక్కీ ఛార్మ్ గా భావిస్తుంటారు. అందుకే తన ప్రతి సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తుంటారు. అలాగే విజయ్ దేవరకొండకు సైతం తన ప్రతి సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేస్తుంటారు.

Follow Us