
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వర్షం. డార్లింగ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.

ఇటీవలే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా మరోసారి థియేటర్లలలో సెన్సేషన్ అవుతుంది. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాకు ముందుగా హీరోగా మరొకరిని అనుకున్నారట. వర్షం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంట. డైరెక్టర్ శోభన్ ఈ కథను ముందుగా మహేష్ కోసం రాసుకున్నారట.

మహేష్ బాబుకు వర్షం సినిమా కథను వివరించగా.. సున్నితంగా తిరస్కరించారట. ఆ కథను తాను సెట్ కానని చెప్పారట మహేష్. దీంతో ఈ సినిమా స్టోరీ ప్రభాస్ వద్దకు చేరింది. కథ విన్న వెంటనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ పట్టాలెక్కింది.

వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పింది వర్షం మూవీ. ఇందులో గోపిచంద్ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.