
డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం లవ్ టూడే ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తమిళంలో విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాతో దక్షిణాది కుర్రాళ్ల మనసు దొచుకుంది హీరోయిన్ ఇవానా షాజీ. ఇందులో నికిత పాత్రలో ఇవానా నటన అద్భుతం. నవ్వించింది.. ఏడిపించింది.. ఈ మూవీతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవడానికి నెట్టింట ఆరా తీస్తున్నారు అభిమానులు.

ఇవానా షాజీ.. మలయాళం నటి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2000 సంవత్సరంలో కేరళలో జన్మించింది ఇవానా.గతేడాది హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్స్ సినిమాలో నటించింది. ఆ తర్వాత రాణి పద్మిని, హీరో వంటి చిత్రాల్లో నటించింది.

ఇక ప్రదీప్ తెరకెక్కించిన లవ్ టుడే మూవీతో ఇవానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో ఆమె నటనతో ఆడియన్స్ మనసు దొచుకుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది ఇవానా. ఈమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇవానా అసలు పేరు అలీనా షాజీ. ఓ సినిమా కోసం ఈమె పేరు మార్చారట.

అందానికే అందం నీవే సుందరి.. మనసులను దొచేస్తోన్న లవ్ టుడే బ్యూటీ ఇవానా ఎవరో తెలుసా..

అందానికే అందం నీవే సుందరి.. మనసులను దొచేస్తోన్న లవ్ టుడే బ్యూటీ ఇవానా ఎవరో తెలుసా..

అందానికే అందం నీవే సుందరి.. మనసులను దొచేస్తోన్న లవ్ టుడే బ్యూటీ ఇవానా ఎవరో తెలుసా..